జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ రాములు
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
అబ్దుల్లాపూర్ మెట్: రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి పసమాముల గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూరమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాములు మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అణగారిన వర్గాల కోసం ఆయన నిద్రలోనే రోజులు గడిపారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడు అని దుష్పచారం చేస్తున్నారని... అలాంటి ప్రచారాలను ఇచ్చి కొట్టాలని... అదేవిధంగా అంబేద్కర్ అందరివాడు కాదు.. అందరివాడ వివరించారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆలోచనలు ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సర్పల్లి నర్సింగరావు, నాయకులు సంఘీ బిక్షపతి, బందం శ్రీనివాస్, రామస్వామి, ఏల శ్రీనివాస్, ఎల రాజు, నాగేశ్వరరావు, పెరక శ్రీధర్, ఏల జంగయ్య, రాకేష్, ఎల మధు, దర్శనం జంగయ్య తదితరులు ఉన్నారు.
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో...
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలో రావినారాయణ రెడ్డి కాలనీలో అబ్దుల్లాపూర్ మెట్ సిపిఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి మాట్లాడుతూ... అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకెళ్లాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సమైక్య నాయకురాలు, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.