కాప్రా: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి తాడూరి గగన్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి పెదర్ల శరత్చంద్ర, ఎస్ఏ. రహీంలు పేర్కొన్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్, బిజెఆర్ కాలనీలో 131వ జ్ఞానమాల కార్యక్రమంల భాగంగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పుస్తకాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానమల సభ్యులు వెంకటయ్య, కొండల్ నగేష్, బాబు, కొమ్ము ఉపేందర్, గడ్డం శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.