24-02-2025 07:32:54 PM
ఆర్టీసీ ఆర్ఎం సోలో మాన్...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేయాలని రీజినల్ మేనేజర్ సోలో మాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి, వైస్ చైర్మన్ సజ్జనర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా డిపోలో సిబ్బందికి శిక్షణ అందజేశారు. సోమవారం శిక్షణ ముగింపు సందర్భంగా హాజరైన ఆర్ఎం మాట్లాడుతూ... శిక్షణలో నేర్చుకున్న మెలుకువలను సిబ్బంది పాటించాలని సూచించారు.
ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలను వివరించారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెదగాలని తెలిపారు. డిపో పరిధిలో ఖర్చులను తగ్గించడంతో పాటు కేఎంపిఎల్ పెంచాలని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ విశ్వనాథ్, డిపో సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.