calender_icon.png 24 September, 2024 | 6:57 AM

గో సంరక్షణకు అందరూ కృషి చేయాలి

24-09-2024 02:30:02 AM

  1. జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ పిలుపు
  2. రెండో రోజు లక్నోలో గోధ్వజ్ స్థాపన యాత్ర

లక్నో (యూపీ), సెప్టెంబర్ 23: గోధ్వజ స్థాపన భారత యాత్రలో భాగం గా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రెండో రోజు కొనసాగింది. జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామీజీ అవిముక్తేశ్వరానంద్ సరస్వతి.. వినాయక్‌పూర్ మహాదేవ్ ఆలయంలో వేదమంత్రాల నడుమ గో ధ్వజాన్ని స్థాపించా రు. గోధ్వజ స్థాపన ద్వారా గోవుల రక్షణకు సనాతన ధర్మాన్ని పాటించేవారందరూ దృఢ సంకల్పంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్నోలో కార్యక్రమం అనంతరం స్వామీజీ బీహార్‌లోని బక్సర్‌కు బయలుదేరారు. నేడు బీహార్ రాజధాని పాట్నాలోని మహావీర్ ఆలయంలో గోధ్వజ్‌ను ఏర్పాటు చేస్తారు. అనంతరం పాట్నాలోని దరోగరాయ్ స్మారక భవన్‌లో గోభక్తులను ఉద్దేశించి అవిముక్తేశ్వరానందద్ సరస్వతి ప్రసంగిస్తారు.