calender_icon.png 8 April, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి

06-04-2025 07:42:59 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

జుక్కల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీరామ మందిరంలో జరిగిన ప్రవచన కార్యక్రమం, శ్రీరాముడి ఊయల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన గంట పాటు ప్రవచనాలు విన్నారు.

శ్రీరామ మందిరం ప్రధాన అర్చకుడు గోపాల్ మహారాజ్ యొక్క ఆశీర్వచనాలను తీసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీరామ చంద్రుడి చల్లని దీవెనలతో జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో వర్ధిల్లాలని, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.