calender_icon.png 6 April, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ ధా పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి

03-04-2025 12:39:12 AM

    - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హెచ్ సి యు భూములను కాపాడేందుకు విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి  ప్రతి ఒక్క పౌరుడు మద్దతు ఇవ్వాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాదు నగరం పర్యావరణ నగరంగా రాబోతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసిందన్నారు. 

బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రాజెక్టులు నిర్మించి అవసరమైన త్రాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. హైదరాబాదులో అనేక బ్రిడ్జిలు నిర్మించి నగరాన్ని ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమి అని అంటున్నారు మరి మన విద్యార్థులు కాదా వారు మన రాష్ట్రానికి చెందినవారు కాదా అని ఆయన ప్రశ్నించారు.  హైదరాబాద్ నగరం బాగుండాలని రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా హరితహారం పేరుతో లక్షలాది మొక్కలు కెసిఆర్ ప్రభుత్వంలో నాటించారని ఆయన పేర్కొన్నారు.

హౌసింగ్ బోర్డ్ స్థలాలను కాపాడి అభివృద్ధి చేస్తుంటే వాటిని కూడా అమ్మేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. హెచ్ సి యు భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులకు బిఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య బారినపడి దెబ్బ తినే అవకాశం ఉంది ప్రజలందరూ స్వచ్ఛందంగా హెచ్ సి యు భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మద్దతు తెలపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పాలనని అందిస్తూ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తుందన్నారు.