కాప్రా (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్నికి చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్బీ కాలనీ డివిజన్ లో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమం కోసం 20 సూత్రాల పథకం, గరీబ్ హటావో వంటి పథకాలను ఆమె ప్రవేశపెట్టిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి, సీతారాంరెడ్డి సింగిరెడ్డి వెంకటరెడ్డి, బుడిగ ప్రభు గౌడ్, బత్తుల శ్రీకాంత్ యాదవ్, సానం రాజు గౌడ్, మల్లేష్, ఆనంద్ రాజ్ గౌడ్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.