బెల్లంపల్లి (విజయక్రాంతి): భారతదేశ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రవి ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాత్రి పాఠశాలలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. భారతదేశంలోని28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల్లో భిన్నంగా ఉంటారని అయినప్పటికీ భారతీయులందరూ ఒకరినొకరు గౌరవిస్తూ జీవించే ఉన్నతమైన సంస్కృతి భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని దానిని ప్రతి ఒక్కరు కాపాడుకుంటూ కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక అంశాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. రాజా రమేష్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.