భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో పోలీస్ శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఎస్ పి. రోహిత రాజు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా తరగతులు ఏర్పాటు హేమచంద్రాపురం నందు గల పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఆర్మడ్ రిజర్వు అధికారులు పాల్గొన్నారు. నిత్యం విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు, మానసికంగా కూడా దృఢంగా ఉండే విధంగా చేయడంలో భాగంగానే ఇకపై ప్రతి శుక్రవారం యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
యోగా, ధ్యానం వంటిని అలవాటుగా చేసుకుని నిత్యం సాధన చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు దైనందిన కార్యక్రమాలలో ఉత్సాహంగా, చురుకుగా పాల్గొనవచ్చని అన్నారు. కావున పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, రమేష్, శివప్రసాద్, ఆర్ఐలు లాల్ బాబు, సుధాకర్, నరసింహారావు, కృష్ణారావు, సిబ్బంది హాజరయ్యారు.