calender_icon.png 22 January, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

22-01-2025 08:38:59 PM

టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ...

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని పేదలను ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ అన్నారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని బ్రహ్మంగారి దేవాలయం వీధిలో క్రిస్మస్ ఫీస్ట్ వేడుకలను బిఆర్ఎస్ నాయకుడు కృపావరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ముఠా జై సింహ మాట్లాడుతూ... యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. ఆయన  బోధనల వల్లే ప్రతి ఒక్కరూ శాంతి, దయా, క్షమాపణ గుణం కలిగి ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను చీదరించుకోకుండా వారిని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ప్రేయర్ పవర్ చర్చస్ డైరెక్టర్ శ్యామ్ అబ్రహం, పాస్టర్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.