calender_icon.png 20 January, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

20-01-2025 06:09:17 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) అన్నారు. సోమవారం జైనూర్ మండలంలోని జాంగాం గ్రామంలో జంగుబాయి ఆలయంలో ఎమ్మెల్యే దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పుష్య మాసం ఆదివాసులకు అతి పవిత్రమైనదని తెలిపారు. జంగోలింగో దీక్షలను ఈ మాసంలోనే స్వీకరిస్తామని తెలిపారు. దీక్ష స్వీకరణతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, సంతోషకరమైన జీవన విధానం మారుతుందన్నారు. దైవ మార్గంలో నడవడం వల్ల దురాలోచనలు దూరమవుతాయని తెలిపారు.