calender_icon.png 19 January, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

08-08-2024 03:33:15 AM

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళీకేరి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశం

గజ్వేల్, ఆగస్టు 7: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వచ్ఛదనం  కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళీకేరి అన్నారు. గురువారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని రాజీవ్‌పార్కు, డంపింగ్‌యార్డును ఆమె పరిశీలిం చారు. ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు. గజ్వేల్, అక్కారం డంపింగ్‌యార్డులో చెత్త సేకరణ, ఎరువుల తయారీ, తడి, పొడి చెత్త గురించి తెలుసుకున్నారు.

మహిళలు తయారుచేసిన జూట్ బ్యాగులను పరిశీలించి మహిళా సంఘాలను అభినందించారు. తదనంతరం ములు గు మండలం జప్తి సింగాయపల్లిలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గన్న కలెక్టర్ మాట్లాఉతూ.. స్వచ్ఛదనం పచ్చదనంలో మహిళల పాత్రే కీలకమైందన్నారు. వర్షాకాలంలో ప్రజలు సీజన ల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటింటికి వెళ్లి మందులను పంపిణీ చేయాలని సూచించారు. ప్రతీ  ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దీన్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మండల ప్రత్యేకా ధికారి, హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ, ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీవో దయాకర్, వివిధ శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.