calender_icon.png 22 January, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

16-07-2024 03:22:43 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూలై 15 (విజయక్రాంతి): ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో సోమ వారం నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్య త్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నేటి తరం మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ప్రతి ఇం ట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని సూచించారు.

అందుకు అవసరమైన మొక్కలను ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. అనంతరం ఆయన కరీంనగర్ పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆల యంలో పూజలు నిర్వహించారు. జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిం దో అందరికీ తెలుసన్నారు. కేంద్ర మంతి బం డి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.