బెల్లంపల్లి (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరు బాధ్యతగా ముక్కలను నాటి సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం తాండూరు మండలంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు