పెన్ పహాడ్, విజయక్రాంతి : మండలం లోని ప్రతి ఒక్కరు సమగ్ర సర్వేలో విధిగా పాల్గొని ప్రతి అంశం లో సర్వే అధికారులకు వివరాలు అందించాలని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ వేముల శ్రవణ్ చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరా వేసే లక్ష్యం పని చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో డ్రగ్స్ గుట్కాలు అమ్మే వారిని గుర్తించాలని యువత మత్తు పదార్థాలకు గురై మాదక ద్రవ్యాల బారిన పడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని, ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమం లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా కారులు పల్లెల లక్ష్మణ్ కుందమల్ల నాగలక్ష్మి గంట భిక్ష పతి పల్లెల రాము మేడి ప్రియదర్శిని ఒంటె పాక ప్రియాంక ఇందిర తదితరులు పాల్గొన్నారు