10-03-2025 08:20:09 PM
హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, సీఐ నాగరాజు గౌడ్....
ఎల్బీనగర్: కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, సీఐ నాగరాజు గౌడ్ సూచించారు. హయత్ నగర్ డివిజన్ లోని అయ్యప్ప కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. హయత్ నగర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిధుల కొరతతో సంవత్సర కాలంగా ఒక్క స్ట్రీట్ లైట్ ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లో హయత్ నగర్ డివిజన్ ను మరింత అభివృద్ధి కృషి చేస్తానన్నారు. సీఐ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా నేరాలు అదుపులోకి వస్తాయని తెలిపారు.
ఒకవేళ ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పటికీ సీసీ కెమెరా ద్వారా వెంటనే సమాచారం సేకరించవచ్చని, ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీస్ సిబ్బందితో సమానమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉగాది ఎల్లప్ప, డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీను, కాలనీ సంఘం అధ్యక్షుడు సూధం కేశవులు, సభ్యులు చిన్నముని శ్రీనివాస్, చెన్నమౌని కుమార్, భీమయ్య, కెవిఎన్ రెడ్డి, రాజశేఖర్, భవానీ గుప్తా, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు వస్పరి వెంకటేశ్, జనార్దన్, గుడాల సంతోష్, శక్తి సింగ్, సురేశ్, బాలు తదితరులు పాల్గొన్నారు.