calender_icon.png 13 February, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి

13-02-2025 05:18:51 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి యు.ఐ.డి.ఎ.ఐ. డిప్యూటీ డైరెక్టర్ చైతన్య కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో చదివి విద్యార్థులు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిపొందేందుకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు సుమారుగా 36 వేల 679 మంది ఉన్నారని, వీరందరికీ ఆధార్ నమోదుకు జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు ఆధార్ నమోదు సేవలు ఉచితంగా పొందవచ్చని, 15 సంవత్సరాలు దాటిన వారు మానిటరింగ్ బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని తెలిపారు.

గతంలో ఆధార్ కొరకు ఈ.ఐ.డి.స్ తిరస్కరణ జరిగిన వారి వివరాలు సేకరించి యు.ఐ.డి.ఎ.ఐ. కార్యాలయం హైదరాబాద్ పంపించాలని, ఆసరా పింఛన్ దారులు, ఉపాధి హామీ కూలీలు, వేలిముద్రలు పడని వారు అప్ డేట్ చేసుకోవాలని తెలిపారు. ఆధార్ నమోదు, అప్ డేట్ కొరకు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లో మెగా క్యాంపులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. తపాలా శాఖ అధికారులు ఆధార్ కార్డులు ఇంటింటికి త్వరగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, సిపిఓ కోటయ్య, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, విద్యాశాఖ అధికారులు, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు, తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు.