calender_icon.png 7 January, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

05-01-2025 11:39:19 PM

నిజాంసాగర్ ఎస్సై శివకుమార్...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో రోడ్డు భద్రతా నియమాలపై మండలంలోని మాగి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు మధ్యపానం సేవించి వాహనాలు నడపొద్దని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరారు.

సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత హమీలకు గురికావోద్దని తెలిపారు. సైబర్ క్రైం నేరానికి గురైతే వెంటనే 1930కి డయల్ చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ టోల్ ప్లాజా, ఇందల్‌వాయి టోల్ ప్లాజా, జుక్కల్ 161వ జాతీయరహదారిపై రవాణా శాఖ అధికారులు లారీలకు భారీ వాహనాలకు వెనుక వైపు స్టిక్కర్లను అంటించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ప్రతి ఒక్కరు భారీ వాహనానికి వెనుక వైపు స్టిక్కర్లు అంటించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్రీశైలం, శ్యామ్, లక్ష్మణ్, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.