calender_icon.png 26 January, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

25-01-2025 12:41:46 PM

ఆదిలాబాద్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ఆర్టిఏ కార్యాలయం వరకు 2కే రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొని 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా జిల్లా ఎస్పీ రెండు కిలోమీటర్ల పరుగులో పాల్గొని యువతను ఉత్సాహపరిచి పరుగును విజయవంతం చేశారు. మొదటగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలయాలపై అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువ శాతం ప్రజల నిర్లక్ష్యం తోటే జరుగుతాయని వాటిని తగ్గించే క్రమంలో ప్రతి ఒక్కరు కృషిచేయాలని తెలియజేశారు. జిల్లా పోలీసు వ్యవస్థ రవాణా వ్యవస్థ వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నదని తెలియజేశారు. అదేవిధంగా హైడ్రోజన్ స్కై బెలూన్ ను కలెక్టరేట్ లో ఆవిష్కరించమన్నారు. డిఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్టీఏ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు