08-03-2025 10:42:47 PM
కార్పొరేటర్ పవన్ కుమార్...
ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ - నాగోల్ మెయిన్ రోడ్డులో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పాల్గొని, రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నవారిని అభినందించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్మ పూజిత ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అబ్దుల్ కరీం, నాయకులు సుందర్ నారాయణ, తోట మహేందర్ యాదవ్, కొత్త తిరుమల, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.