13-04-2025 12:00:00 AM
-ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరు భక్తి భావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సార్లరావు పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయం శనివారం వేద పండితుల మధ్య ప్రారంభోత్సవం జరిగింది. రెండో రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై పూజలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్, స్థానిక మాజీ సర్పంచ్,బంజారా సేన జాతీయ అధ్యక్షుడు జర్పుల ప్రవీణ్ నాయక్, ఆలయ పూజారి (ధర్మకర్త) సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి జర్పుల లక్పతి నాయక్ ఆధ్వర్యంలో పూజ లు కొనసాగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా ప్రత్యేక పూజ లు, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజలో తండా ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్పుల టిక్లాల్ నాయక్, జర్పుల రవి నాయక్, జర్పుల లక్ష్మణ్ నాయక్, రాజు, క్రాంతి,సీతారాం, మంగు, రఘు, శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు.