calender_icon.png 5 December, 2024 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

12-11-2024 01:18:47 PM

కోదాడ: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గల శివాలయంలో కార్తీకమాస ఏకాదశి సందర్భంగా ఎర్నేని బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక అన్నారు. ఆలయంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ, వెంకట్ రత్నం బాబు తదితరులు ఉన్నారు.