calender_icon.png 23 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరం అవగాహన కల్పించాలి

21-04-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇందు లో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది సర్కార్. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్, ఇతర నటీనటులు తమవంతుగా భాగస్వామ్యం అంది స్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నగరంలో టీవర్క్స్ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సినీ నటుడు చిరంజీవి వర్చువల్ సందేశం పంపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదాం అని ఆయన పిలుపునిచ్చారు. వ్యసనాలకు బానిసైన కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని మెగాస్టార్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల కట్టడిపై ప్రభుత్వంతోపాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని చిరు పిలుపునిచ్చారు.