13-02-2025 12:00:00 AM
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి
మునగాల, ఫిబ్రవరి 12 : కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని ముకుందాపురంలో ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన యలమంచిలి ఆదిశేష సాయి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు యలమంచిలి శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతులు నిర్మించిన అదనపు నాలుగు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి పాల్గొని గదులను శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు.
సమాజ సేవలో ముందుండాలి సమాజంలో అనాధ శరణాలయాలు ఉండాలి వృద్ధాప్యం వచ్చాక పిల్లలు ఉండితల్లిదండ్రులనువృద్ధాశ్రమాలలోకి పంపించడం బాధాకరం. ప్రతి ఒక్కరూ శ్రీనివాసరావు దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని, 25 సంవత్సరాలుగా సమాజ సేవలో ముందుంటున్న నాగిరెడ్డి విజయమ్మ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ వేమూరి సత్యనారాయణ. ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు. కోదాడ డిఎస్‌పి శ్రీధర్ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు, వెంకట నరసయ్య, ఓుంగంటి ప్రభాకర్, ఎస్‌ఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.