బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బెల్లంపల్లి అటవీ క్షేత్ర అధికారి సీ హెచ్. పూర్ణచందర్ కోరారు. సోమవారం బెల్లంపల్లి మండలంలోని బుగ్గ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ విరుద్ధ పదార్థాలను ఏరివేత కార్యక్రమాన్ని అటవీ, దేవాదాయ శాఖ సిబ్బంది తో కలిసి నిర్వహించారు. బుగ్గ దేవాలయం ప్రాచీనమైనదని దీని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు సూచించారు. దేవాలయ పరిసర ప్రాంతంలో భక్తులు తాగిపడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి క్షేత్ర అటవీ సిబ్బందితోపాటు దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.