నిర్మల్ (విజయక్రాంతి): బాల్యవివాహలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని బాల్యవివాహలు చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను జిల్లా జడ్జి రాధిక విద్యార్థులకు వివరించారు. పట్టణంలోని సోఫినార్ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన బాల్య వివాహ నివారణ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలు చేస్తుందని 18 సంవత్సరాల నిండిన తర్వాతనే బాలికలకు పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీనిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల కమిటీ చైర్మన్ వాహద్ ఖాన్, అధికారులు మురళి, రజిత, పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ పాల్గొన్నారు.