calender_icon.png 4 February, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

04-02-2025 12:00:00 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 3 : ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, జిల్లా జడ్జి శ్రీవాణి, ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ గీత నాగశ్రీ అన్నారు. అక్షర ఫౌండేషన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో సోమవారం వికాస్ కాలేజ్  ఆఫ్ ఫార్మసీ, రాయినిగూడెంలో క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారూ.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధని, ప్రపంచంలో వంద రకాల క్యాన్సర్ ఉన్నాయన్నారు. ఈ వ్యాధి జన్యువులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రొమ్ము, గర్భాశయ, కిడ్నీ, ఊపిరితులు, నోటి, యూరినల్ కాన్సర్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. 

సమాజంలో అక్షర ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాసు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్షన్ రెడ్డి, ఆడెపు రమేష్, సాధినేని శ్రీనివాస్, సుభాష్ చంద్రబోస్, వినయ్ కుమార్,  నీలిమ, భవాని తదితరులు పాల్గొన్నారు.