calender_icon.png 23 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కౌట్ ప్రతి ఒక్కరికి అవసరం

23-04-2025 12:36:09 AM

విద్యార్థులలో మంచి లక్షణాలను, 

సేవా గుణాన్ని అలవరుస్తుంది -: సీఐ రాజు వర్మ

చర్ల, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి):  విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి లక్షణాలు, సేవా భావాలను అలవర్చుకోవాలని చర్ల సీఐ రాజు వర్మ అన్నారు. మంగళవారం స్థానిక గురుదేవ్ విద్యాలయం లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ స్కౌట్ కమిషనర్ యు.ఆనంద్ కుమార్ , స్కౌట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ , డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఎం.భరతమాత , స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ పి.వెంకట రమణ   ఆర్గనైజింగ్ కమిషనర్ జి. చలపతి హాజర య్యారు .ముఖ్య అతిథులుగా ఎంఈఓ పరిటాల వెంకటరమణ , చర్ల సి.ఐ ఎ.రాజు వర్మ , ఎస్త్స్ర ఆర్. నర్సిరెడ్డి , ఎస్త్స్ర పి.కేశవ రావు పాల్గొన్నారు. .

ఈ సందర్భంగా ఎం.ఇ.ఓ  పరిటాల వెంకటరమణ  మాట్లాడుతూ గురుదేవ్ స్కూల్లో పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదపడే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో  విద్యార్థులను భాగస్వాములను చేయడం  సంతోషదాయకం అన్నారు.  సిఐ రాజు వర్మ మాట్లాడుతూ గురుదేవ్ విద్యాలయంలో ఇంత మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాల్గొనడం స్కౌట్ పిల్లలలో మంచి లక్షణాలను సేవా గుణాన్ని అలవరుస్తుందని ప్రశంసించారు. అనంతరం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమం లో అకడమిక్ కో ఆర్డినేటర్స్ ఎం.వి. ఎస్. సుబ్రమణ్యం , జి. శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.