calender_icon.png 16 October, 2024 | 5:59 PM

బాలికల హక్కులు, అవకాశాలను సాధించడం కోసం అందరు పాటు పడాలి

16-10-2024 03:15:03 PM

చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్

కరీంనగర్, (విజయక్రాంతి): బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా సాయినగర్ లో గల గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్ పాల్గొని బాల బాలికలు వారి హక్కులు కోసం పోరాడి ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అని అన్నారు. బాలికల సాధికారతకు అందరు పాటు పడాలి అని అన్నారు. సాధికారత పొందిన అమ్మాయి నిజానికి ఆమె కుటుంబం మరియు దేశానికి ఒక ఆస్థి అని అన్నారు.

అనంతరం బాలల హక్కులు, బాలికలకు మహిళా శిశు సంక్షేమ ద్వారా అందిస్తున్న సేవలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నంబర్, సేఫ్ టచ్, ఆన్ సేఫ్ టచ్, భేటీ బచాఓ భేటీ పడాఓ, బాల్య వివాహల ద్వారా వచ్చే అనర్థలా గురించి, స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ద్వారా వచ్చే అనర్థలా గురించి అవగహన కలిపించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కృపరాణి,మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ శైలజ, ఔట్రీచ్ వర్కర్ రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ మహేష్, టీచర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.