25 May, 2026 | 2:41 AM

సనాతన ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

25-05-2026 01:52 AM

హిందూ సమ్మేళనంలో మోహన్‌దాస్

చారకొండ, మే 24: మానవ సమాజ కల్యాణానికి సనాతన హిందూ ధర్మమే మూలస్తంభమని  ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ రక్షణకు పునరంకితం కావాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మోహన్ దాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని భావితరాలకు అందించాలని సమాజంలో ఐక్యత లోపించినప్పుడు ధర్మానికి హాని జరుగుతుందన్నారు.

ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రబోధించారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళన ఇంచార్జీ రవిచారి, మండల అధ్యక్షుడు చలమొని కృష్ణ, గిరిజన మోర్చ అధ్యక్షుడు రవినాయక్, నాయకులు శ్రీకాంత్, లక్ష్మణ్ శర్మ, ప్రశాంత్ శర్మ, వేణు శర్మ, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.