- ఏసీఎఫ్ నాయకురాలు విమలక్క
- సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం
- హాజరైన మందకృష్ణమాదిగ, ప్రముఖులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు అందరూ అంగీకరించాలని పలువురు వక్తలు సూచించారు. అరు సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) నాయకురాలు విమలక్క సమన్వ ప్రజాసంఘాల ఉమ్మడి ఐక్య ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఎస్సీవ ప్రజాస్వామిక హక్కని చాటుదాం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘వర్గీకరణకు సై అందాం.. మాలమాదిగలమొకటవుదాం’ అ పాటల సీడీని, ‘రిజర్వేషన్లు, వర్గీకరణ ప్రజాస్వామిక హక్కు’ అనే బుక్‌లెట్‌ను అతిథులు ఆవిష్కరించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశానికి అరుణోదయ నాయకురా అనిత, పీడీఎస్‌యూ విజృంభణ నాయకుడు విజయ్ అధ్యక్షత వహించగా..
రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాశీం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, పృథ్వీరాజ్, ప్రొ.కొండానాగేశ్వర్, గాయకులు గద్దర్ నర్సన్న, దరువు అంజన్న సహా వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
మాల సోదరి కోసం జైలుకెళ్లాను..
తానెప్పుడూ మాల సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మంద అన్నారు. దేశంలో రిజర్వేషన్లపై చర్చ జరగడం ఇది మూడోసారి అని తెలిపారు. తన గ్రామంలో అగ్రవర్ణాలతో జరిగిన ఘర్షణలో చిన్నతనంలోనే మాల సోదరి కోసం జైళుకెళ్లానని మందకృష్ట గుర్తుచేసుకున్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావానికి ముందు మాల పల్లెల్లోనే ఉన్నానని చెప్పారు.
ఇంతకాలం బ్రా వైశ్యులు, బీసీలు, మైనార్టీ, వికలాంగులు, మహిళలు, ఉద్యమకారులకు అండగా తాము పోరాడామని.. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమానికి వారంతా మద్దతుగా నిల ఆనందంగా ఉందన్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు కర్ణగంటి రవి, రఘునందన్, బత్తుల సిద్ధేశ్వర్, కాసం సత్యనారాయణ, సోగ్రాబేగం, సరోజినినేత పాల్గొన్నారు.
సామాజిక బాధ్యతతో పనిచేయాలి
జర్నలిస్టులు సామాజిక బాధ్యతతోపని చేయాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కలం గళం వినిపించాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న నగరంలో నిర్వహించబోయే వేల గొంతులు, లక్ష డప్పులు ప్రదర్శన విజయవంతానికై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎంజేఎఫ్, టీజేయూ, ఎండబ్ల్యూజేయూ తదితర జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దేశంలోని మెజార్టీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ జరగాలని మద్ధతిచ్చాయని పేర్కొన్నారు. ఎంజేయూ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్, ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మాతంగి దాసు, జాతీయ కోఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్, ఎండబ్ల్యూజేయూ రాష్ట్ర కన్వీనర్ సుంచు అశోక్, టీజేయూ కప్పరి ప్రసాద్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌బాబా, ఐజేఎఫ్ నాయకులు నర్సింహ, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.