calender_icon.png 24 March, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో అందరూ కేసీఆర్‌లే!

23-03-2025 01:14:56 AM

  1. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
  2. ఏపీలో కూటమితోనే టీడీపీకి అధికారం
  3. పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్
  4. ఎర్రవల్లికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర 

సిద్దిపేట, మార్చి 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా తయారు కావాలని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని కార్యకర్తలకు మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఎండిన రైతుల పంటలకు గోదావరి నీళ్లు విడుదల చేయాలంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు చేరుకుంది.

200మందితో 180 కిలోమీటర్లు, వారం రోజుల పాటు సాగిన పాదయాత్ర గురించి తెలుసుకున్న కేసీఆర్ చందర్‌తో పాటు కార్యకర్తలను అభినందించి మాట్లాడారు. ఏపీలో కూటమి లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని చెప్పారు. గత సంవత్సరం ఈ సమయానికి నిండు కుండలా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయాయో సమాజానికి తెలియజేసేందుకు పాదయాత్ర చేపట్టడాన్ని అభినందిం చారు.

‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. ప్రజలు ఏం అనుకున్నారో కానీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అది వాళ్ల ఇష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తుంది’ అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సాగు, తాగు నీటి సమస్య తలెత్తిందన్నారు. రాష్ట్ర పాలకులు సాగునీటిని ఆర్థిక సమస్యగా చూస్తున్నారని, భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు.

నీటిని ఖర్చుకు లింకు  ఆలోచన చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ స్థిరీకరణ కోసం పటిష్టమైన కార్యాచరణను అమలు చేసి వ్యవసాయ అభివృద్ధిగా పాలనా సాగిందన్నారు. ప్రాజెక్టుల ద్వారా పొలాలకు సాగు  నా  విద్యుత్ అందించినట్లు గుర్తు చేశారు. పెట్టుబడి సాయం ఇచ్చి, పం  ధాన్యా  గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.

అందుకే పదేళ్ల పాటు రైతులు, ప్రజలు ఏలాంటి ఇబ్బందులు పడలేదని చెప్పారు. ఎండకాలంలో కూడా మత్తడి దూ  జలాశయాల్లో ఇప్పుడేందుకు నీళ్లు లేవు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పల్లెల నుంచి హైదరాబాద్‌కు బ  వచ్చిన వాళ్లకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పటి ప్రభుత్వం వారి బతుకుదెరువు మీద మట్టికొట్టి ఇండ్లను కూల్చిందని విమర్శించారు.

తెలంగాణ సమా  ఇకనైనా తెలి  ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాం  అని సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నెహ్రూ, ఇందిరాగాంధి మోసాలే చేశారన్నారు. ఇక్కడికి చంద్రబాబు రావాలని, వచ్చె ఎన్నికల్లో ఎన్డీ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా  రానున్న పరిస్థితులు ఏమిటో ప్రజానీకానికి అర్థం కా జలని సూచించారు. 

తెలంగాణను ఆగం చేయాడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని, వారిని పసిగట్టి వారి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎని  మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఏకాన కూడా పని కాలేదన్నారు. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ నాయకులను పార్లమెం ట్‌కు పంపిస్తే కొట్లాడి మన హక్కులను కాపాడుకుందుమని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్ర మంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ  మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పుట్ట మధు, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.