calender_icon.png 6 February, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలను తగ్గించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

30-01-2025 12:00:00 AM

 వికారాబాద్, జనవరి 29:  మనదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏడాదిలో  రెండు లక్షలమంది మృత్యువాత పడుతున్నారని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మహావీర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఆర్టిఏ కార్యాలయం వద్ద బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబంలో ఒకరు ప్రమాద బారిన పడితే తీవ్రంగా ఆర్థిక నష్టాల్లో కురుకపోవాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్ తదితరులు పాల్గొన్నారు.