31-03-2025 12:00:00 AM
- చేసే పనిని నిబద్ధతతో చేయండి
-దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర మార్చి 30 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని చేసే ప్రతి పనిలోనూ నిబద్ధతతో పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన మునగాల రవి గత సంవత్సరం ఎలక్ట్రిక్ వర్కర్ గా పనిచేస్తూ, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో, స్థానిక ఎమ్మెల్యే జియంఆర్ చొరవ తీసుకుని, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయించి, నేడు వారి కుటుంబ సభ్యులకు రూ 5 లక్షల చెక్కును స్థానిక నాయకుల సమక్షంలో అందజేశారు. అమిస్తేపురంలో చలివేంద్రమును ప్రారంభించారు.
అంతకుముందు దమగ్న పూర్ లో ఎమ్మెల్యే స్వగృహంలో ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన 41 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మొదటి విడత రూ 1,78,000 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సంక్షేమ కోసం ప్రభుత్వం పాటుపడి పని చేస్తుందని తెలియజేశారు. కలిసికట్టుగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.