అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌రెడ్డి’. నూతన దర్శకుడు స్మరణ్ తెరకెక్కిస్తున్నారు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్‌రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి నిర్మాతలు. సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. “మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా కష్టపడి చేసిన సినిమా ‘లవ్‌రెడ్డి’. ఆంధ్ర, నైజాం, సీడెడ్‌లో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను. అంజన్‌కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లిపోయే ఉద్దేశం లేదు. నా ‘క’ సినిమా రెండు రోజులు ఆగి చూసినా ఫర్వాలేదు. ‘లవ్‌రెడ్డి’నైతే వెంటనే చూసేయండి” అన్నారు. ‘ఈ రోజుల్లో సకుటుంబంగా చూసే ప్రేమకథ లు రాయడం, తెరకెక్కించడం కష్టం. స్మరణ్ అందరూ మెచ్చే లవ్‌స్టోరీని రాశాడు’ అని హీరో అన్నా రు. గణేశ్, తిలక్, జ్యోతి, సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ, చిత్రబృందం పాల్గొన్నారు.