నటి పూజా బేడీ మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను ఏమి చేసినా వంద శాతం ఇస్తాను. విడాకుల సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా. లైఫ్ పార్ట్‌నర్‌తో జీవితాంతం ఇబ్బందులు పడేకంటే విడాకులు తీసుకోవడం బెటర్. సరైన సమయంలో విడాకులు తీసుకోవడం వల్లనే నాకు విముక్తి లభించింది. మగవాళ్లను నిలదీయడం ద్వారా మంచి మహిళ కాలేరు.
అందరూ సమానమే అని గుర్తించాలి. జీవితం చాలా చిన్నది. చాలా అందమైంది కూడా. పుట్టి మరణిస్తాం. కేవలం ఉనికిలోనే ఉండకండి. జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి. నా జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. మా అమ్మమ్మ చనిపోయింది. ఇష్టమైన కుక్క విడిచిపెట్టిపోయింది. భర్తకు దూరమయ్యాను. అయినా నేనెప్పుడూ ఏడవలేదు. ప్రతి విషాదం నాలో ధైర్యం నింపింది” అని అన్నారామె.