కొండాపూర్ సిఐ వెంకటేష్..
మునిపల్లి: ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కొండాపూర్ సిఐ వెంకటేష్ అన్నారు. శనివారం మునిపల్లి మండలంలోని బుదేరాలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ముందు ఉంచుకొని కష్టపడి చదువుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బోధించిన అంశాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్, కళాశాల ప్రిన్సిపల్, ఆధ్యాపకులు, పోలీసులు పాల్గొన్నారు.