15-03-2025 10:31:05 PM
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao), జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు హాజరై కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... కంప్యూటర్ విద్య అనేది ప్రతి విద్యార్థికి అవసరం అని అన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ప్రతి విద్యార్థి అందిపుచ్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుందన్నారు. ఈనాడు కంప్యూటర్ విద్యపై అవగాహన లేక పోతే రాబోయే రోజుల్లో పోటీ పరీక్షల్లో నెగ్గడం చాలా జటిలమవుతుందని అన్నారు. విద్యార్థి దశ నుంచి కంప్యూటర్ పైన అవగాహన కలిగి ఉంటే సాఫ్ట్వేర్ వైపు ఉద్యోగాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.