calender_icon.png 11 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పాఠశాలలో బ్రెయిలీ లిపి: చైర్మన్ ముత్తినేని వీరయ్య

04-01-2025 11:30:56 PM

మలక్‌పేట,(విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు బ్రెయిలీ లిపీలో పాఠ్యాంశాలు నేర్చుకునే లా ఒక విధానాన్ని రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లుతామని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. అంధుల ఆరాధ్య దైవం సర్ లూయి బ్రెయిలీ 216వ జయంతోత్సవాలను పురస్కరించుకుని మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని బ్రెయిలీ విగ్రహానికి ముత్తినేని వీరయ్య, మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభ రాణి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజ పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు చుక్కల బ్రెయిలీ లిపీని సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారన్నారు. సర్ బ్రెయిలీ చిరస్మరణీయంగా ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయారని, ఆయన భౌతికంగా  లేకపోయినప్పటికి లిపి ద్వారా తరతరాలుగా స్మరించుకుంటారని కొనియాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. త్వరలోనే పింఛన్ పెంపును ప్రభుత్వం అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని అనితా రాంచంద్రన్ హామీనిచ్చారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎయిడ్స్, అప్లయన్సెస్ కోసం రూ.50కోట్లను మంజూరు చేసిందన్నారు.  ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసించి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని ఘనంగా సన్మానించారు. దశాబ్దాలుగా గడుస్తున్న బ్రెయిలీ లిపినీలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా భాషలకు బ్రెయిలీ లిపీ ఉపయోగించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గంగారాం, శ్రీశైలం, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.