calender_icon.png 25 January, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రూపాయీ ప్రేక్షకుడి నవ్వుతో వస్తోంది!

24-01-2025 12:00:00 AM

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తు తం థియేటర్లలో ప్రదర్శితమవుతూ, ఇప్పటి వరకూ రూ.230 కోట్లు వసూలు చేసింది.

ప్రేక్షకుల నుంచి అనూహ్యంగా విశేషమైన ఆదరణ వస్తుండటం తో ఆ ఆనందాన్ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొ న్నారు. సమావేశంలో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సిని మాకు వచ్చిన ప్రతి రూపా యూ ప్రేక్షకుడి నవ్వుతో రావ డం చాలా హ్యాపీగా ఉంది’ అన్నారు. 

ఐటీ వాళ్లూ సంక్రాంతికే రావాలనుకున్నారేమో..!

ఈ సందర్భంగా వెంకటేశ్‌ను ‘ఇండస్ట్రీ లోని ప్రముఖులపై జరుగుతున్న ఐటీ రైడ్స్‌పై మీరేమంటారు?’ అని ప్రశ్నిం చగా.. “ఐటీ రైడ్స్ జరుగుతున్నా యా.. నిజమా? మిగతా వాళ్ల గురించి నాకు తెలియదు. నేను నా పారితోషికం వైట్ లో తీసుకుంటా. నా రెమ్యూనరేషనూ తక్కువే కదా..” అని చమత్కరిం చారు. ‘మీ నిర్మాత దిల్ రాజు ఐటీ రైడ్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారేంటి?’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడిని సరదాగా అడగ్గా..

“సం క్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టాం కదా.. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యుం టారు. దిల్ రాజు బాధలో ఏమీ లేరు. ఆయనొక్కడి పైనే కాదు.. ఇండస్ట్రీలో చాలా మందిపై రైడ్స్ జరుగు తున్నాయి.  ఇదంతా ఒక ప్రాసెస్‌లో భాగమే. ప్రతి రెండు, మూడేళ్లకోసారి జరుగుతూనే ఉంటాయి. తను వచ్చినా రాకున్నా ప్రమోషన్స్ మాత్రం ఆపొద్దని.. విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోమని దిల్ రాజు చెప్పారు” అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.