చిత్రం: గేమ్ ఛేంజర్, నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వాణి, అంజలి. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: తిరు, కథ: కార్తీక్ సుబ్బరాజ్, నిర్మాత దిల్ రాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్ శంకర్
ఐదేళ్ల తర్వాత సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్ వచ్చాడు. ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శంకర్‌కు తెలుగు స్ట్రుటై చిత్రమిది. రామ్ చరణ్, శంకర్ కాంబో.. అలాగే దిల్ రాజు నిర్మాత కావడం, తమన్ సంగీతం అందించడం.. అన్నీ కలగలిసి సినిమాపై అంచనాలను చాలా ఎత్తుకు తీసుకెళ్లాయి. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉందా?
కథేంటంటే..
రామ్ నందన్ (రామ్ చరణ్) నీతి నిజాయితీలకు పెద్ద పీట వేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్. తన ప్రే యసి కోసం కోపానికి ధూపమేసి (ధుప్) ఐఏఎస్ చేసి కలెక్టర్ అవుతాడు. ఆయన విశాఖకు కలెక్టర్‌గా రాగానే అక్కడ బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జే సూర్య) తో గొడవ ప్రారంభమవుతుంది.
మంత్రిగా ఉన్న మోపిదేవి తన తండ్రి అయిన ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్)ని హతమార్చి సీఎం కావాలను కుంటాడు. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. మోపిదేవి సీఎం అయ్యాడా? ఆయన అవినీతి, అక్రమాలను రామ్ నందన్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి)తో రామ్ నందన్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
సినిమా మొత్తంగా ఒక పొలిటికల్ డ్రామా.. తొలి భాగమంతా విశాఖ కలెక్టర్‌గా రామ్ నందన్ రావ డం.. అతని లవ్ స్టోరీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా ఓ స్థాయిలో సాగు తూ ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు పార్వతి కనిపించడం.. ఆమెను చూడగానే సత్యమూర్తి షాక్ అ వడం వంటి సన్నివేశాలుంటాయి. ఇంటర్వెల్ బ్యా ంగ్ తో సినిమా ఒక సీరియస్ టర్న్ తీసుకుంటుం ది.
ఇంటర్వెల్ అనంతరం అప్పన్న, పార్వతి క్యారెక్టర్‌ల ఎంట్రీ ఉంటుంది. ఇది సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. వీరిద్దరికీ సంబంధించిన సన్నివేశాలు, పాటలు సినిమాను ఓ స్థాయికి తీసుకెళతాయి. ప్రతి ఒక్క పాత్ర కూడా సినిమాకు ఎంతమేర అవసర మో అంతమేర దర్శకుడు వినియోగించుకున్నా రు. సినిమాకు రామ్‌చరణ్, ఎస్‌జే సూర్యల నటన ప్ర ధాన బలం. ఎక్కడా హీరోయిజాన్ని అతిగా చూపించేసి విలన్‌ను పాత్రను తగ్గించడం వంటివి చేయక పోవడంతో చూస్తున్న వారికి విసుగు అనిపించదు.
రామ్ చరణ్ లవర్ బాయ్‌గానూ.. బా ధ్యత కలిగిన ఆఫీసర్‌గానూ.. అభ్యుదయ పార్టీ నేతగానూ మూడు విభి న్న కోణాల్లో విభిన్నంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక చాలా కాలం తర్వా త తిరిగి ఒకప్పటి సునీల్ ఈ సిని మా ద్వారా కనిపించాడు. ఈ విధమైన పాత్రలు చేస్తూ పోతే సునీల్ కు మళ్లీ కెరీర్ అద్భుతంగా మార డం ఖాయం. తిరు విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.
తమన్ సంగీతం సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. దిల్ రాజు ఎక్క డా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే మ నకు అర్థమవుతుంది. అయితే ఒకట్రెండు విషయాల్లో జాగ్రత్త వహించి ఉండాల్సింది అనిపిస్తుంది. రామ్ నందన్, దీపికల ప్రేమకథను ఇంకాస్త బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని పొలిటికల్ సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉన్నాయనిపిస్తుంది.