calender_icon.png 25 February, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి

25-02-2025 01:23:45 AM

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) : ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేలా అధికారులు అర్జిదారులకు సూచనలు సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి; కాలం పూర్తి అయ్యే వరకు త్రాగు నీరు,విద్యుత్ సరఫరా పై మండలం లోని గ్రామాల వారీగా మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

వేసవిలో విద్యుత్ సరఫరా పీక్ లో ఉన్నందున విద్యుత్ సరఫరా పరిస్థితిని, త్రాగు నీరు సరఫరాలో స మస్యలు ఉత్పన్నం కాకుండా ఆయా గ్రామా ల్లో, పట్టణాల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండలు తీవ్రత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని, వడ దెబ్బ బారిన పడకుండా అధికారులు అవగాహన కలిగించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల తో సమావేశం ఏర్పాటు చేసి త్రాగు నీరు,విద్యుత్,వేసవి ఉష్ణోగ్రతల పై సమీక్షించాలని అన్నారు. 

సంక్షేమ వసతి గృహాలు, కె.జి.బి.వి.లు, గురుకుల పాఠశాలలు రెగ్యులర్ గా మండల ప్రత్యేక అధికారులు తనిఖీ నిర్వహించి ఎక్కడైనా అత్యవసర రిపేర్ లు; అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.పారిశుధ్యం,స్వచ్చత వంటి అంశాలు,ఇతర సమస్యలు ఉంటే ఆయా గురుకుల పాఠశాల లు,సంక్షేమ వసతి గృహాలు,కె.జి.బి.వి లకు సూచనలు చేస్తూ సరిదిద్దుటకు సంబంధిత; వార్డెన్ లు,ప్రిన్సిపాల్ లకు ఆదేశాలు జారీ చేసి తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఈ నెల 24 తేదీ నుంచి ప్రారంభం అయినా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, అర్.డి. ఓ నవీన్, జడ్.పి.సి. ఈ. ఓ తదితరులు పాల్గొన్నారు.