- నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి
- హైదరాబాద్ సిటీ పోలీసులతో డీజీపీ జితేందర్ సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): ప్రతి పోలీస్ అధికారి ఒక రోల్ మోడల్‌గా మారాలని.. శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కష్టపడి పనిచేయాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో తదనుగుణం గా మనమందరం కూడా ఉత్తమ పద్ధతులను అనుసరించి విధులు నిర్వర్తించాల న్నారు.
కాస్మోపాలిటన్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడటం, లా అండ్ ఆర్డర్ నిర్వహణ, నేరాలను కట్టడి చేయడం, నేర పరిశోధనలో త్వరిగతన గుర్తింపు, వివిధ పండుగల కోసం బందోబస్తు కల్పించడంలో హైదరాబాద్ సిటీ పోలీసు అధికారుల పనితీరు బాగుందని అభినందించారు. కమిషన రేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులతో గౌరవంగా మెలగాలని, వచ్చిన ప్రతీ ఫిర్యాదు స్వీకరించలన్నారు.
అలాగే డ్రగ్ సరఫరా, సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపా లని చెప్పారు. సిటీ ట్రాఫిక్ అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిందని వాటిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వారాని కి ఒకసారైనా పత్రికా ప్రకటనల ద్వారా ట్రాఫిక్ నియమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వీఐపీ సంస్కృతిని అరికట్ట డంతో పాటు సోషల్ మీడియాను హ్యండిల్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఎంపిక చేసుకోవడం వంటివి చేయాలని సిటీ పోలీసులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్‌మాన్‌సింగ్, అడిషనల్ ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్, అడ్మిన్ జాయింట్ సీపీ పరిమళ హననూతన్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.