06-03-2025 12:49:01 AM
తుంగతుర్తి, మార్చి5 : వన నర్సరీతో పాటు హరిత వనంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ ఆదేశించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలోనీ నర్సరీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ వేసవి సీజన్లో నీటి ఎద్దడి నుండి మొక్కలను కాపాడి వాటికి సరిపోయే నీటిని తరచుగా నీటిని అందించాలని సూచించారు.
హరితవనంలో నాటిన మొక్కలకు, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు సైతం నీటిని అందించాలని కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బైక్ పై వెళ్ళి పరిశీలించారు. పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించే బాధ్యత ఉపాధి హామీ సిబ్బందిపై ఉందని అన్నారు. రెండు కిలోమీటర్ల మేరకు మోటార్ సైకిల్ పై ప్రయాణం చేసి ఉపాధి హామీ పనులను పరిశీలించడం పలువురు అభినందించారు .
ఉపాధి హామీ పనులు చేసే ప్రదేశంలో కూలీలకు పూర్తిగా మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు వేసవి కాలంలో నీడ , త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అదే సందర్భంలో పాఠశాలల్లో కొనసాగుతున్న స్వపరిపాలన దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు. చిన్నారులు ఉన్నత అధికారుల వేషధారణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే స్ఫూర్తితో విద్యార్థుల క్రమశిక్షణతో విద్య ను ఆభ్యసించి తాను అనుకున్న లక్ష్య సాధన కోసం కృషి చేసి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతిని విద్యార్థులకు 10 పై 10 జిపిఏ సాధించే విధంగా ప్రేరణ ప్రేరణ తరగతిని ప్రేరణ అంశాలను బోధించారు. వారి వెంట ఎంపీడీవో సునీత, మండల విద్యాశాఖ అధికారి రాముల నాయక్, ఏపిఓ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శి రవి శర్మ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు