calender_icon.png 17 March, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నగ ప్రత్యేకమే!

09-03-2025 12:00:00 AM

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెద్దవాళ్లు ఇంటి పనుల్లో మునిగిపోతే.. మగువలు మాత్రం తమకు నప్పే నగలపై దృష్టిపెడుతున్నారు. ఇక అమ్మాయిలు ఎక్కువగా ఉండే ఇళ్లుతై.. పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ సందడే ఇంటికి ప్రత్యేకమైన శోభను తీసుకొస్తుంది. ముఖ్యంగా పెళ్లిలో ప్రత్యేకంగా పెళ్లి కూతురు గురించి చెప్పుకోవాలి.

పెళ్లి చూపుల చీర నుంచి ముక్కుపుడక వరకు ప్రతిదీ ఓ జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటుంది. ఈ విషయంలో ఈతరం మగువలు అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. జ్యూవెలరీ కోసం ఎక్కువమంది అమ్మాయిలు ఫాలో అవుతున్న వైబ్‌సైట్ ఒకటి ఉంది. అదే కుశాల్స్.. ఇది మగువల మనసుదోచుకున్న వెబ్‌సైట్‌గా చెప్పవచ్చు. దీంట్లో ప్రతి నగ దేనికదే ప్రత్యేకం.. 

వరలక్ష్మీ పూజ.. సత్యనారాయణ వ్రతం.. వాలెంటైన్స్ డే.. మదర్స్ డే.. రాఖీ పండగ.. వినాయక చవితి.. బతుకమ్మ.. సంక్రాంతి.. పెళ్లిళ్ల సీజన్.. వేడుక ఏదైనా కాని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తున్నది. బంగారానికి ఏ మాత్రం తీసుపోని డిజైన్స్‌తో మనకు ఇక్కడ కనిపిస్తాయి.

కుశాల్స్ వెబ్‌సైట్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో బ్రాంచ్ లు కూడా చాలానే ఉన్నాయి. సోషల్ ప్లాట్‌ఫామ్స్.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్.. వెబ్‌సైట్స్‌ను ఫాలో అయితే చాలు కన్ను తిప్పకుండా నగ లను చూస్తునే ఉంటారు. అందుబాటు ధరలలో నచ్చిన నగను కొన్నుకొవచ్చు.

కుందన్ సెట్

కుందన్ సెట్ ఎలాంటి వారికైనా నప్పుతుంది.. ఎందుకంటే ఈ నగలలో పొదిగిన రత్నాలు చూడముచ్చటగా, డిఫరెంట్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి. ఈ జ్యువెలరీ నైట్‌టైమ్ పార్టీలకు బాగుంటుంది. 

నెక్లెస్ సెట్

మనల్ని పూర్తిగా పండుగ మూడ్‌లోకి తీసుకెళ్లే అద్భుతమైన నెక్లెస్ సెట్ ఇది. ఈ నగ ధరిస్తే కచ్చితంగా స్టయిలీష్‌గా.. హుందాగా కనిపించడం ఖాయం.