సహస్ర అవధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రవచన కర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి వ్యక్తి జ్ఞానం కోసం చదువుకోవాలని సహస్ర అవధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప ఆలయ సేవా సమితి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల పేరు మీద దానధర్మాలు చేయాలని కోరారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలవాలన్నారు. శివునికి కార్తీక మాసం అత్యంత ప్రియమైందని అన్నారు. అందుకే అయ్యప్ప దీక్షపరులు పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని భావిస్తారన్నారు. వైదిక ధర్మం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అందరూ అనుసరించ దగ్గదని అన్నారు. కుటుంబంలో సమస్యలు వస్తే కూర్చుండి పరిష్కరించుకోవాలని కోరారు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు గురు స్వాములు, అయ్యప్ప స్వాములు, పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు.