నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి రోజు యోగ చేయడం వల్ల మనిషికి శారీరక ఉల్లాసం కలుగడమే కాకా ఆరోగ్యవంతమైన జీవనం పొందవచ్చని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం ఆయూస్ వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మంజురైన 10 యోగ శిక్షణ కేంద్రాలను ప్రాంరంభం చేశారు. పట్టణంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసినన యోగ కేంద్రంలో పూజలు నిర్వహించి ప్రాంరంభం చేశారు. యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి తెలిసి యోగపై ప్రజల ఆసకితం పెంచాలని సూచించారు.
ఆనంతరం వైద్యశాలను పరిశీలన చేశారు. ప్రభుత్వం స్థలం ఆక్రమణకు గురి కాకుండ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అందకు మందు కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవంను పరిష్కరించుకొని కలెక్టర్ ఆదనపు కలెక్టర్‌లు అధికారులు శపధం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అహ్మద్, డిఆర్‌వో రత్న కళ్యాణి, వైద్యులు గంగాధర్, సురేష్ కుమార్, గోపాల్, సుసిల్ శ్రీనివాస్, సమత, సిబ్బంది పాల్గోన్నారు.