calender_icon.png 9 February, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రూపాయీ అవసరమే!

09-02-2025 12:11:01 AM

డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు నిర్వహణ గురించి కూడా మహిళలకు తెలిసుండాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అప్పుడే కుటుంబం ఆర్థికంగా  ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలు ప్రతి దశలోనూ కొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు. పెళ్లయ్యాక అందరు మహిళలు ఉద్యోగం చేయాలని లేదు.

ఒక్కోసారి కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగా కొనసాగాల్సి రావచ్చు. అలాంటప్పుడు సైతం ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టి ప్రతి రూపాయీ వృథా కాకుండా బడ్జెట్ వేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

ఈ క్రమంలో నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటివి తీసుకోవడం.. అవసరమంటున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవచ్చు. ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.