16-04-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
ప్రతి పట్టా మార్పిడికి సర్వేయర్లు మ్యాప్ జత పరచాలి
గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 15(విజ యక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం లోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్‌రావులతో కలిసి భూ భార తి నూతన ఆర్వోఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై మండలాల తహసీల్దార్లు, నాయ బ్ తహసీల్దార్లు, గిర్ధవార్లు, రెవెన్యూ సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకం గా ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో తీసుకువ చ్చిన అంశాలు, హక్కులపై ప్రతి అధికారి ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భూ భారతి చట్టంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఏదైనా పట్టా మార్పిడిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ధరణి పోర్టల్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదని తెలిపారు. రాజ స్వ మండల అధికారులకు అప్పీల్ చేసుకుని, అధికారి ఇచ్చిన జడ్జిమెంట్‌పై కలెక్టర్‌కు, సి. సి.ఎల్.ఎ.కు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. విరాసత్, కొనుగోలు, గిఫ్ట్ డీడ్, పాలు పంపకం చేసుకునే దానిపై సంబంధీకులకు నోటీసులు జా రీ చేసే వీలు ఉందని తెలిపారు. ప్రతి పట్టా మార్పిడికి సర్వేయర్లు మ్యాప్ జత పరచవలసి ఉంటుందని, ఇటువంటి అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకుగాను ప్రతి రెవెన్యూ అధికారి చట్టంలోని అంశాలపై అవగాహన కలిగి ఉం డాలని తెలిపారు. కార్యక్రమంలో సర్వే ల్యాం డ్ ఎ.డి. సోమేశ్వర్, తహసీల్దారులు, నాయ బ్ తహసీల్దార్లు, గిర్ధవార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.