కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఇంటర్ పరీక్షలపై సమీక్ష
రంగారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి) మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బం దీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుండి ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహ ణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయా లని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికా రులతో వాట్సప్ గ్రూప్ చేయాలన్నారు.
ఆర్డీఓ కార్యాలయాలలో ఎగ్జామ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 185 పరీక్షా కేంద్రాల ద్వారా 77,863 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 69,348 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు.
పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిం చాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకో వాలని తెలిపారు.
సమావేశంలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, చేవెళ్ళ ఆర్డీఓ చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, రాచ కొండ, సైబరాబాద్ పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మెడికల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.